కొత్తకోట రూరల్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెద్దమందడి మండలం వెల్టూరులో ఉన్న జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాల, కొత్తకోట మండలం అమడబాకుల జూనియర్ కళాశాల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీ పరిశీలించడంతో పాటు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సరుకులు వచ్చినప్పుడు ఎన్ని వచ్చాయి.. నాణ్యత ఎలా ఉందనేది విద్యార్థుల కమిటీ ద్వారా పరిశీలించి రిజిస్టర్‌లో సంతకం తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట కొత్తకోట తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంఈఓ కృష్ణయ్య, మోడల్ స్కూల్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment