జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
ఆత్మకూర్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెఈసీ రెండో సంవత్సరం చదువుతున్న సమీనాబేగం జాతీయస్థాయి అండర్–19 వాలీబాల్ పోటీలకు ఎంపికై ందని కళాశాల ప్రిన్సిపాల్ భ్యాగ్యవర్ధన్‌రెడ్డి శనివారం తెలిపారు. కోసకగీలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై ందని.. 2025, జనవరి 12, 13, 14 తేదీల్లో విజయవాడలో జరిగే పోటీల్లో పాల్గొంటుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినికి వాలీబాల్‌తో పాటు నగదు అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, రాఘవేందర్‌రావు, సునీల్, శ్వేత, పావని, చైతన్య, రాణి, లలితమ్మ, వీణ, రాఘవేంద్ర, బాలకృష్ణ, బుచ్చయ్య, రామన్‌గౌడ్, సతీష్, విమల, అనిత, కోచ్ ఖాదర్, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment