4న ఉప ముఖ్యమంత్రి రాక
వనపర్తి: ఉమ్మడి గోపాల్‌పేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకుగాను ఈ నెల 4న శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వస్తున్నట్లు మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రేవల్లి మండలం తల్పునూరుగోపాల్‌పేట మండలం ఏదుట్లలో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్లను ప్రారంభించిన అనంతరం గోపాల్‌పేటలో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, ఎంపీ డా. మల్లు రవి, సాట్ చైర్మన్ కె.శివసేనారెడ్డి తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
యూనియన్ బ్యాంక్‌ను సందర్శించిన ఎస్పీ
అమరచింత: మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకును మంగళవారం ఎస్పీ రావుల గిరిధర్ మంగళవారం సందర్శించారు. బ్యాంకులో సోమవారం జరిగిన చోరీ విఫల యత్నం, పరిసరాలను పరిశీలించారు. లోనికి, స్ట్రాంగ్‌రూంలోకి ఎలా వెళ్లారు.. కిటికీని ఎలా తొలగించారు.. సీసీ కెమెరాల తీగల తొలగింపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కేసు పురోగతి గురించి సీఐ శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. నిఘా పెంచాలని, నేరస్తులను త్వరగా గుర్తించాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. ఆయన వెంట సీసీఎస్ సీఐ రాంపాల్, ఎస్‌ఐలు జయన్న, సురేశ్ ఉన్నారు.
రైల్వే పనులకు
సహకరించండి : ఆర్డీఓ
ఆత్మకూర్: రైల్వే అభివృద్ధి పనులకు రైతులు సహకరించాలని, భూ సేకరణ అనంతరం పరిహారం అందుతుందని ఆర్డీఓ సుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం మండలంలోని దేవరపల్లి, ఆరేపల్లిలో రెవెన్యూ, రైల్వే అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్–డోన్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయని ఆయా గ్రామాల్లో రైల్వే వంతెనల నిర్మాణానికి భూ సేకరణ చేపడుతున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ చాంద్‌పాషా, ఆర్‌ఐ ఆసీఫ్, సర్వేయర్ రామకృష్ణ, రైల్వే అధికారులు, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment