ఇందిరమ్మ సర్వే పూర్తి చేయాలి
ఆత్మకూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే రెండ్రోజుల్లో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని పిన్నంచర్ల, మోట్లంపల్లిలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆత్మకూర్ మండలంలో 5,847 దరఖాస్తులు రాగా.. 4,775 సర్వే పూర్తయిందని, పురపాలికలో 2,882 దరఖాస్తులకుగాను 2,798 ఇళ్ల సర్వే పూర్తయిందన్నారు. వలస వెళ్లినవారు రెండ్రోజుల్లో సర్వే అధికారులకు పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు.
లేఅవుట్లలో నిబంధనలు పాటించాలి..
లేఅవుట్ల ఏర్పాటులో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. గురువారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాల ప్రాంతంలో 4.15 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. హద్దులు, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు తదితర వాటిని పరిశీలించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాలకు అనుసంధానంగా వసతులు కల్పించాలని.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాజశేఖర్, ఏఈ నర్సింహ, ఇరిగేషన్ ఏఈ కిషోర్, ఆర్‌అండ్‌బీ డీఈ సీతారామస్వామి, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీరాంరెడ్డి, పుర కమిషనర్ చికినె శశిధర్, టీపీఓ కరుణాకర్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
Comments
Please login to add a commentAdd a comment