విస్తరణ పనుల్లో వేగం పెంచండి
వనపర్తి: జిల్లాకేంద్రంలో అసంపూర్తిగా ఉన్న రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాన్‌గల్ రోడ్, హైదరాబాద్ రోడ్‌తో పాటు మిగతా పెండింగ్ రహదారుల విస్తరణ గురించి సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ సీతారామస్వామి ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment