ప్రైవేటుకు దీటుగా రాణించాలి
ఆత్మకూర్: విద్యార్థులు బాగా చదివి మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి (డీఐఈఓ) అంజయ్య కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూత్రశాలలు, ల్యాబ్‌లు, శిథిలావస్థకు చేరుకున్న భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒకే మూత్రశాల ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు డీఐఈఓతో మొరపెట్టుకున్నారు. అధ్యాపకులు సులభ పద్ధతిలో బోధన చేసి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేసి పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తీసుకొచ్చిన కేక్ కట్‌చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ భాగ్యవర్ధన్‌రెడ్డి, అధ్యాపకులు టీజే విశ్వేశ్వర్, కురుమూర్తి, రాఘవేందర్‌రావు, వీణ, లలితమ్మ, చైతణ్యరాణి, సునీల్‌కుమార్‌రెడ్డి, పావని, రాఘవేందర్, బాలకృష్ణ, బుచ్చయ్య, రామన్‌గౌడ్, సతీష్‌కుమార్, విమల, అనిత, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment