తల్లిపాలు శిశువుకు శ్రేయస్కరం
వనపర్తి విద్యావిభాగం: తల్లిపాలు శిశువుకు శ్రేయస్కరమని.. ఆరు నెలల వరకు తల్లిపాలు తాగించాలని డీడబ్ల్యూఓ లక్ష్మమ్మ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న 1వ అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ప్రాముఖ్యత, ఆకుకూరల్లోని పోషకాల గురించి వివరించారు. అనంతరం ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన చేశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ భారతి, అంగన్‌వాడీ టీచర్ రామచంద్రమ్మ, ఆయా ఉమాబాయి, ఆశ కార్యకర్త పారిజాత, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment