రాష్ట్రంలో అసమర్థ పాలన
వనపర్తి టౌన్: పదేళ్ల బీఆర్‌ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏ మాత్రం వ్యత్యాసం లేదని.. అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా పూర్తిస్థాయిలో క్యాబినెట్‌ను ఏర్పాటు చేయలేని అసమర్థ స్థితిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. బీజేపీ జిల్లా సంస్థాగత కార్యశాలలో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను వంచిస్తోందని, కేసుల విచారణ, కమిటీల పేరుతో సంవత్సర కాలం ముగించిందే తప్పా ఆరు గ్యారంటీల మాటున ఇచ్చిన 420 హామీల అమలు ఊసేలేదని ఎద్దేవా చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రెండు, మూడు దఫాలు నిర్విరామంగా బీజేపీ పాలన అందించడానికి కార్యకర్తల సంకల్ప బలమే పునాదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. దానిని అనుకూలంగా మలుచుకొని క్షేత్రస్థాయిలో కార్యాచరణ వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కంటే బీజేపీ పైచేయి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, సంస్థాగత జిల్లా రిటర్నింగ్ అధికారి రాజేందర్‌రెడ్డి, నాయకులు, ఎస్.వెంకట్‌రెడ్డి, ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, శ్రీశైలం, పెద్దిరాజు, రామన్‌గౌడ్, చిత్తారి ప్రభాకర్, వెంకటేశ్వర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నయ్య, రాజశేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment