పాన్‌గల్: అనుమతి లేకుండా అటవీ ప్రాంతం నుంచి కలప, మట్టి, ఇసుక, రాయి తరలిస్తే చర్యలు తప్పవని డీఎఫ్‌ఓ నిఖిల్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గోప్లాపూర్ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో వనపర్తి, ఘనపూర్ ఫారెస్టు రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో కవాత్ నిర్వహించి అటవీ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ అనుమతులు లేకుండా అటవీ ప్రాంతాలకు వెళ్లరాదని, చెట్లను నరికినా, వన్యప్రాణులను వేటాడినా, అటవీ ప్రాంతం సీపీటీ బౌండరీలను చెరిపినా, అడవికి నిప్పు పెట్టినా, విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ సిబ్బంది విధులకు అడ్డుపడినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు భారీ జరిమానా, జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఘన్‌పూర్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment