ఏడు కేసుల్లో.. 17 మంది
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రావుల గిరిధర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏడు కేసుల్లో 17 మంది నిందితులను గుర్తించి కోర్టులో హాజరు పరుస్తున్న విషయంతోపాటు నేరాలకు పాల్పడిన విధానం, నేరం వైపు వారిని నడిపించిన తీరు.. పేరు మోసిన సైబర్ నేరగాళ్ల వివరాలను వెల్లడించారు. కోర్టులో హాజరుపరిచిన 17 మంది నిందితుల్లో అందరూ 30 ఏళ్లలోపు యువకులు.. ఇంజినీరింగ్ చదివిన ఓ మహిళ ఉందని ఎస్పీ విస్మయం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాకేంద్రంతో పాటు గోపాల్‌పేట మండలంలోని మున్ననూరు, గద్వాల తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 35 మంది యువకులు.. కోల్‌కత్తా, పాట్నా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన అంకిత్, రాహుల్, పంకజ్ అనే పేరుమోసిన నేరగాళ్ల ఉచ్చులో పడి ధని, ముద్ర రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ అంటూ.. రూ.2 కోట్లకుపైగా దోచుకున్నారు. ఇలా వచ్చిన డబ్బుల్లో 20 – 30 శాతం స్థానిక యువకులు ఇవ్వడంతో వారు ఆ డబ్బులతో జల్సాలకు అలవాటుపడి విమానాల్లో తిరగడం, ఖరీదైన మోటార్ సైకిళ్లు, సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి.. నేరాలు చేసేందుకు ప్రేరేపితులవుతున్నట్లు ఎస్పీ చెప్పారు. అలాగే సైబర్ నేరంలో మొత్తం 35 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. ప్రస్తుతం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిలో ఆరుగురు వనపర్తి, మరొకరు గద్వాల జిల్లాలకు చెందిన యువకుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment