జాతీయస్థాయి కబడ్డీకి జిల్లా క్రీడాకారులు
వనపర్తి టౌన్: జనగామ జిల్లాలో గత నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో వనపర్తి జిల్లా చెందిన మధు, దినకర్, అనూష అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి డా. ఎం.రాము ఆదివారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
అర్హులకే రైతు భరోసా అభినందనీయం
వనపర్తి టౌన్: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని.. ప్రభుత్వానికి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్‌పార్టీ కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు యాదయ్య, మైనార్టీసెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ సమద్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి సాగు రైతులకు రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందించడంతో పాటు అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లుసీఎం రేవంత్‌రెడ్డికి ప్రకటించారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు గుట్టలు, రోడ్లు, పరిశ్రమల భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వందల ఎకరాలు కబ్జా చేసిన నాయకులకు రైతుబంధు ఇచ్చి రూ.22 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా పంట పండించే ప్రతి రైతుకు రైతుభరోసా ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. పాలమూరు ముద్దుబిడ్డ దివంగత నేత ఎస్.జైపాల్‌రెడ్డి పేరును పాలమూరు ప్రాజెక్టుకు పెట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment