ఆత్మకూర్ మండలంలోని నందిమళ్ల, మూలమళ్ల, ఆత్మకూర్ శివారు ప్రాంతాల్లోని జూరాల ప్రధాన ఎడమకాల్వ, సమాంతర కాల్వలకు ఇరువైపులా ఉన్న ల్యాండ్‌బ్యాంక్ సైతం ఆక్రమణకు గురైనట్లు పలుమార్లు ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు నేటికీ చర్యలకు ఉపక్రమించకపోవడం శోచనీయం. రెండేళ్ల కిందట ప్రభుత్వం ప్రధాన కాల్వల ల్యాండ్‌బ్యాంక్‌కు రక్షణ వలయం ఏర్పాటు చేయాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. మార్గదర్శకాలు, నిధులు విడుదల చేయకపోవడంతో అధికారుల హడావుడి మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమికి సర్వేనంబర్లు, బైనంబర్లు మార్చి పట్టాలు సైతం జారీచేసిన ఘటనలు ఆత్మకూర్ మండలంలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అధికారులు విచారణ చేస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫ కొత్తకోట మండలం మిరాసిపల్లి శివారులోని 1,152 ఎకరాలకు సాగునీరు అందించేందుకు భీమా ఫేస్–2 పరిధిలోని ప్యాకేజీ–15, డిస్ట్రిబ్యూటరీ–12ను సుమారు రెండు కిలోమీటర్ల మేర నిర్మాణం చేశారు. కొన్నాళ్లు నిర్దేశిత ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందింది. ఇటీవల కొందరు డిస్ట్రిబ్యూటరీ కాల్వలను మధ్యలో పూడ్చివేయడంతో ప్రస్తుతం నిర్దేశిత ఆయకట్టులోని కొంత మేర పొలాలకు సాగునీరు అందడం లేదు. ఈ విషయంపై రైతులు కలెక్టరేట్ ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేసినా నేటికీ విచారణలోనే ఉండటం గమనార్హం.
ఫ వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నె, వీపనగండ్ల శివారులోని జూరాల కాల్వకు ఇరువైపులా ఉన్న ల్యాండ్‌బ్యాంకు ఆక్రమణకు గురైంది. గోపల్‌దిన్నె రిజర్వాయర్ వద్ద భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసిన మట్టిని సైతం అక్రమార్కులు అనధికారికంగా తరలించి సొమ్ము చేసుకున్నారు.
ఫ రేవల్లి మండలం చీర్కపల్లి శివారులోని ఓ చెక్‌డ్యాంను కొందరు రైతులు ఆక్రమించి తమ పొలాల్లో కలిపేసుకున్న ఘటనలోనూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు అందాయి.
ఫ పెబ్బేరు మండలంలోని జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఇరువైపులా ఉండాల్సిన ల్యాండ్ బ్యాంక్ భూమి సైతం ఆక్రమణకు గురైనట్లు స్థానిక రైతులు అధికారులకు మౌఖికంగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment