కాస్త తగ్గారు..! | - | Sakshi
Sakshi News home page

కాస్త తగ్గారు..!

Published Mon, Jan 6 2025 6:59 AM | Last Updated on Mon, Jan 6 2025 6:59 AM

కాస్త

కాస్త తగ్గారు..!

టార్గెట్‌ ఇవ్వలేదు..

ఉమ్మడి జిల్లాలో ఎకై ్సజ్‌ అధికారులు ఎవరికీ మద్యం అమ్మకాలు పెంచాలని టార్గెట్‌ ఇవ్వడం లేదు. అలాగే మద్యం దుకాణాలకు కూడా విక్రయాలు పెంచాలని చెప్పలేదు. 2023 ఏడాదితో పోల్చితే 2024లో కొంతమేర విక్రయాలు తగ్గాయి. ఇక 2023 డిసెంబర్‌తో పోల్చుకుంటే 2024 డిసెంబర్‌లో 18 శాతం విక్రయాలు తక్కువ ఉన్నాయి. అమ్మకాలు తగ్గాయని ఏ ఒక్క అధికారిపై చర్యలు కూడా తీసుకోలేదు.

– శ్రీనివాస్‌రెడ్డి, డీసీ, ఎకై ్సజ్‌ శాఖ

2024లో 6.5 శాతం

తగ్గిన మద్యం విక్రయాలు

ఉమ్మడి జిల్లాలో గతేడాది రూ.2,717.21 కోట్ల అమ్మకాలు

ప్రతినెలా సర్కిల్‌ కార్యాలయాలకు లక్ష్యం కేటాయింపు

మైనస్‌లో ఉన్నారని నలుగురు సీఐలకు చార్జీ మెమోలు జారీ?

లక్ష్యం చేరికకు బెల్ట్‌ దుకాణాలను ప్రోత్సహిస్తున్న ఎకై ్సజ్‌ శాఖ

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి పాలమూరులో 2023 కంటే 2024లో మద్యం విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మందుబాబులు గతేడాది మొత్తంగా రూ.2,717.21 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకై ్సజ్‌ సర్కిల్‌ కార్యాలయానికి ప్రత్యేక లక్ష్యం కేటాయించి.. గడువులోగా పూర్తి చేసేలా చేస్తున్నారు. ప్రధానంగా ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు ప్రత్యేక లక్ష్యాలు కేటాయించడంతో వారు మద్యం దుకాణదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి నెలనెలా ఇచ్చే టార్గెట్‌ అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సూచిస్తున్నారు.

ప్రతి నెల 20 శాతం పెంపు..

ఉమ్మడి జిల్లాలోని 230 మద్యం దుకాణాల పరిధిలో ప్రతినెలా 20 శాతం మద్యం విక్రయాలు పెంచాలని సర్కిల్‌ అధికారులకు ఎకై ్సజ్‌ ఉన్నతాధికారులు లక్ష్యం కేటాయిస్తున్నట్లు అంతర్గత సమాచారం. దీంతో ఎకై ్సజ్‌ అధికారులు మద్యం దుకాణదారులకు ప్రతినెలా కొంత లక్ష్యం ఇచ్చి ఆ మేరకు విక్రయాలు పెంచాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి సర్కిల్‌ పరిధిలో ఉన్న చిన్న దుకాణానికి నెలకు రూ.80 లక్షల వరకు, ఇక పెద్ద దుకాణాలకు రూ.1.30 కోట్ల వరకు లక్ష్యం నిర్దేశిస్తున్నట్లు సమాచారం. అయితే గతేడాది ఇచ్చిన లక్ష్యం పూర్తి చేయలేదని ఉమ్మడి జిల్లాలో నలుగురు సీఐలకు చార్జీ మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో లక్ష్యం మేరకు మద్యం విక్రయాలు చేయడానికి అటు ఎకై ్సజ్‌ అధికారులతోపాటు మద్యం దుకాణదారులు బెల్ట్‌ షాపులకు విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతున్నారు. ఇక పల్లెల్లో బెల్ట్‌ దుకాణదారులు ప్రతి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధికంగా వసూలు చేస్తున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నా..

ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్‌లో 90, నాగర్‌కర్నూల్‌లో 67, వనపర్తిలో 37, గద్వాలలో 36 మద్యం దుకాణాల్లో 2023 సంవత్సరం మద్యం విక్రయాలతో పోల్చితే 2024లో 6.5 శాతం మద్యం విక్రయాలు తగ్గాయి. 2023లో ఎమ్మెల్యే ఎన్నికల ఉండటం వల్ల అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు భారీగా పెరిగాయి. ఇక 2024లో పార్లమెంట్‌ ఎన్నికలు ఉన్నా కూడా కొంతమేర విక్రయాలు తగ్గాయి. మహబూబ్‌నగర్‌ ఎకై ్సజ్‌ సర్కిల్‌ పరిధిలోని 28 మద్యం దుకాణాల్లో 2023లో 384.03 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే.. 2024లో రూ.381.81 కోట్ల విక్రయాలు జరిగాయి. జడ్చర్ల సర్కిల్‌ పరిధిలో 26 మద్యం దుకాణాలు ఉండగా 2023లో రూ.324.24 కోట్ల అమ్మకాలు జరగగా.. 2024లో రూ.327.09 కోట్ల మద్యం విక్రయించారు. ఇక్కడ మాత్రం 2023తో పోల్చితే 2024లో రూ.3 కోట్ల వరకు విక్రయాలు పెరిగాయి.

టాప్‌లో పాలమూరు

గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా మొదటి స్థానంలో నిలవగా.. చివరగా వనపర్తి జిల్లా ఉండటం విశేషం. పాలమూరులో కూడా అధిక విక్రయాలు జడ్చర్లలో ఉన్నాయి. ఆ తర్వాత రెండో స్థానంలో నాగర్‌కర్నూల్‌, మూడో స్థానంలో గద్వాల జిల్లాలు ఉన్నాయి.

జిల్లాల వారీగా గతేడాది జరిగిన మద్యం విక్రయాల వివరాలు

జిల్లా ఐఎంఎల్‌ బీరు ఆదాయం

(రూ.కోట్లలో..)

మహబూబ్‌నగర్‌, పేట 11,47,177 17,23,820 1,106.83

నాగర్‌కర్నూల్‌ 6,50,693 10,79,673 675.07

గద్వాల 5,68,011 5,31,032 506.23

వనపర్తి 4,39,996 6,06,772 429.64

No comments yet. Be the first to comment!
Add a comment
కాస్త తగ్గారు..! 1
1/1

కాస్త తగ్గారు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement