ప్రకృతి ఒడిలో..
వాతావరణం
రోజురోజుకు చలి తీవ్రత కాస్త పెరుగుతుంది. మంచు కురుస్తుంది. అప్పుడప్పుడు చల్లటి గాలులు వీస్తాయి.
పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న నల్లమలలోని టైగర్ సఫారీ
ఆక్టోపస్ వ్యూ పాయింట్
●
● వారాంతాలు, సెలవు రోజుల్లో
క్యూ కడుతున్న సందర్శకులు
● నెల వ్యవధిలో రెండుసార్లు
కనిపించిన పెద్దపులి
● వన్యప్రాణులు తరుచుగా
తారసపడుతుండటంతో ఆసక్తి
● రెండు రకాల ప్యాకేజీలతో
అవకాశం కల్పిస్తున్న అటవీశాఖ
జింకలు కనిపించాయి..
టైగర్ సఫారీలో మాకు జింకల గుంపు, అడవి పందులు కనిపించాయి. సుమారు గంటసేపు అడవిలో సంచరించడం కొత్త అనుభూతినిచ్చింది. అడవి అందాలతోపాటు వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు ఈ సఫారీని వినియోగించుకోవచ్చు.
– నిఖిల, హైదరాబాద్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీ అధికారులు టైగర్ సఫారీ ద్వారా పులులు, చిరుతలు, ఇతర వన్యప్రాణులు, అడవి అందాలను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. నల్లమలలో 34 వరకు పెద్ద పులులు, వందకుపైగా చిరుతలు, ఎలుగుబంట్లు, వందల సంఖ్యలో జింకలు, దుప్పులు, మనుబోతులు, అడవి పందులు, అడవి కుక్కలు తదితర వన్యప్రాణులు ఉన్నాయి. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణించే సందర్శకులకు తరుచుగా ఈ వన్యప్రాణులు కనిపిస్తున్నాయి. ఇటీవల డిసెంబర్ నెలలోనే సందర్శకులకు రెండుసార్లు పెద్ద పులులు కన్పించాయి. ఎలుగు బంట్లు, జింకలు, మనుబోతులు ఇక్కడికి వస్తున్న సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. నల్లమలను సందర్శించాలనుకునే పర్యాటకులు అటవీశాఖ టైగర్ స్టే ప్యాకేజీతోపాటు జంగిల్ సఫారీ ట్రిప్‌ను అందిస్తోంది. సఫారీ వాహనంలో ప్రయాణించాలనుకునే సందర్శకులు హైదరాబాద్– శ్రీశైలం రహదారిలో ఉన్న ఫర్హాబాద్ గేటు వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్..
అడవి అందాలను ఆస్వాదిస్తూ, వన్యప్రాణుల గురించి తెలుసుకోవాలనుకునే ఔత్సాహిక సందర్శకులకు నల్లమల ప్రాంతం బెస్ట్ ప్లేస్. ఇక్కడ ఎకో టూరిజంలో భాగంగా టైగర్ స్టే ప్యాకేజీ, సఫారీ సౌకర్యాలను కల్పిస్తున్నాం. అడవి, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటూనే సందర్శకులకు అవకాశం కల్పిస్తున్నాం.
– రోహిత్ గోపిడి, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్
ట్రిప్ బాగుంది..
ఇక్కడి టైగర్ సఫారీ చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చాం. ఈ సఫారీ ట్రిప్ మాకెంతో నచ్చింది. మాకు నీల్‌గాయి, జింకలు కనిపించాయి. దట్టమైన అడవి మధ్యలో సఫారీ వాహనంలో ప్రయాణించడం మర్చిపోలేని ఫీలింగ్. ఇకపై వీకెండ్స్‌లో తరుచుగా ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడికి వస్తాం.
– షుబా, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment