ఉన్నత ఉద్యోగమే ఆశయం..
ఉన్నతమైన ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చదుతున్నా. అధ్యాపకుల సూచనలు పాటిస్తూ పత్రికల్లో వచ్చిన పలువురి విజయగాథలను చదువుతాను. వారిలా గొప్ప ఉద్యోగం సాధించి పుట్టిన ఊరు, కుటుంబ సభ్యులకు మంచిపేరు తీసుకురావాలని ఉంది. అందుకోసం ఎంత కష్టమైనా భరించి లక్ష్యసాధన కోసం కృషి చేస్తా.
– సానియా, బీఎస్సీ తృతీయ
సంవత్సరం
పట్టుదలతో చదివితే
ఉన్నత శిఖరాలకు..
వనపర్తి జిల్లాకు చెందిన బ్యాంకు ఉద్యోగి నేడు ఎస్‌బీఐ చైర్మన్ స్థానంలో ఉన్నార. నిజాయితీ, పట్టుదల, అంకితభావంతో పనిచేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పేందుకు ఆయన జీవితమే ఓ ఉదాహరణ. ఆయనను ఆదర్శంగా తీసుకొని బ్యాంకు ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. డిగ్రీ పూర్తిచేసిన వెంటనే బ్యాంకు కోచింగ్ వెళ్తాను.
– సల్మా షేక్, బీఎస్సీ తృతీయ సంవత్సరం
సాంకేతిక రంగంలో రాణిస్తా
సాఫ్ట్‌వేర్ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించాలనేదే లక్ష్యం. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కంటే అడ్వాన్స్‌గా ఉండే మొబైల్ యాప్‌లను తయారు చేసి ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకురావాలని ఉంది. అడ్వాన్స్ ఫీచర్లతో కూడిన యాప్‌లను తయారు చేసేందుకు కృషి చేస్తా. – లక్ష్మీకాంత్,
బీఎస్సీ తృతీయ సంవత్సరం
Comments
Please login to add a commentAdd a comment