అశాసీ్త్రయ సాగుతోనే మామిడి రైతులకు నష్టం
వీపనగండ్ల: అశాసీ్త్రయ సాగు విధానాలు అవలంబించడంతోనే మామిడి రైతులు నష్టపోతున్నారని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సురేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో మామిడిలో ‘సస్యరక్షణ చర్యలు.. చీడపీడల నివారణ’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. పూత త్వరగా రావాలని కల్తార్ అనే రసాయనాన్ని అధిక శాతంలో వినియోగిస్తున్నారని.. దీంతో తేనెమంచు తెగులు, క్రిమి కీటకాలు వృద్ధి చెంది నష్టం కలిగిస్తున్నాయని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో తోటలకు నీరందించే వసతులు ఉంటేనే పెట్టుబడి పెట్టాలని రైతులకు సూచించారు. ఇప్పటికే 50 శాతం పూత వచ్చిన తోటలకు తేలికపాటి నీటి తడులు అందించాలన్నారు. వచ్చిన పూతల్లో 98 శాతం మగ, రెండు శాతం ద్విలింగ పూతలు ఉంటాయని, ఉద్యాన అధికారుల సూచనలు పాటించి మందులు పిచికారీ చేయాలని తెలిపారు. ఎకరాకు రూ.25 వేలు ఖర్చు చేస్తే 3 టన్నుల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా ఉద్యాన అధికారి సురేష్, మండల ఉద్యాన అధికారి కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment