పంటమార్పిడితోనే అధిక దిగుబడులు
వీపనగండ్ల: రైతులు పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌నాయక్ సూచించారు. మంగళవారం మండలంలో పర్యటించి పంటల సాగు వివరాల నమోదు పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతువేదికలో ‘పుట్ట గొడుగుల పెంపకం.. కలిగే ప్రయోజనాలు’ అనే అంశంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. సేంద్రియ సాగుతో అనేక ప్రయోజనాలు ఉంటాయని.. వరి కొయ్యలను తగలబెట్టడంతో అందులో ఉండే ఉపయోగకర సూక్ష్మజీవులు మరణిస్తాయని వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే పురుగు మందులను పిచికారీ చేయాలని, దుకాణదారుల మాటలు నమ్మి నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment