లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
వనపర్తి విద్యావిభాగం: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రజని హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనిచేసే చోట మహిళలను వేధిస్తే 2013 చట్టం ప్రకారం తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. మహిళలను మాటలు, సైగల ద్వారా ఇబ్బందులకు గురి చేసినా చట్టపరంగా శిక్షార్హులవుతారని తెలిపారు. 10 మంది కలిసి పనిచేసే చోట మహిళా కార్మికులు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేసుకొని రక్షణకు చొరవ చూపాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం జి.గురురాజుయాదవ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని
Comments
Please login to add a commentAdd a comment