తెలంగాణకు అన్యాయం..
త్వరలో ఎన్నికలు జరిగే ఢిల్లీ, బీహార్‌తో పాటు కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో ఆశించిన మేర కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, ఆరుగురు ఎంపీలు ఉన్నా.. నిధుల కేటాయింపులు చేయించలేకపోయారు. కేంద్ర జీడీపీలో ఐదు శాతం రాష్ట్ర భాగస్వామ్యం ఉందంటూనే నిరాశకు గురిచేశారు. కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సి ఉండింది.
– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి
రాజకీయ
అవసరాల బడ్జెట్..
కేంద్ర బడ్జెట్ తమ రాజకీయ అవసరాలకు రూపొందించినట్లుగా ఉంది. ఏటా బడ్జెట్‌లో కేంద్రం పేర్కొంటున్న పద్దులు వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా ఉన్నాయి. ప్రతి బడ్జెట్‌లో ఆహార రాయితీని కొంతమేర తగ్గిస్తున్నారు. ఈ విధానం పేద ప్రజలపై ప్రభావం చూపిస్తుంది. 30 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం సాధించారో చెప్పాలి. తెలంగాణ ప్రయోజనాలు పెంచే విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు విఫలమయ్యారు.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి
వికసిత భారత్ లక్ష్యంగా..
కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత సమయంలోపు వికసిత భారత్ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఏటా 8 శాతం జీడీపీ పెంచాలనే ప్రయత్నంగా వార్షిక బడ్జెట్ రూపొందించింది. ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం సాంప్రదాయమనే విషయం మరిచి విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగులు, మహిళా సంఘాలకు భారీ ఎత్తున ఉరట కల్పించింది నేటి కేంద్ర బడ్జెట్.
– నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
●
Comments
Please login to add a commentAdd a comment