బయో ఫర్టిలైజర్స్ పంపిణీ
కొత్తకోట రూరల్: మండలంలోని కనిమెట్టలో ఎస్సీ రైతులకు ఈసీఏఈ ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో కొనుగోలు చేసిన బయో ఫర్టిలైజర్‌ను మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య ఆదేశానుసారం ఇన్‌చార్జ్ డీన్ షాహనాజ్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువుల వినియోగంతో నేల, వాతావరణం కలుషితమవుతుందని.. బయో ఫర్టిలైజర్ రైతుకు, పొలానికి, పంటకు రక్షణగా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ సబ్‌ప్లాన్ ఇన్‌చార్జ్ బేబీ రాణి, ఏఈఓలు రమేశ్, వినయ్, గ్రామస్తులు పరమేశ్, సురేశ్, బాబు, మంద సురేందర్, యువకులు గజ్జల కృష్ణ, గౌని రాంరెడ్డి, మంద విశ్వేశ్వర్, నాగన్న, మంద మల్లేశ్, దయాకర్, భీంరెడ్డి, లక్ష్మికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
అరుణాచలానికి
ప్రత్యేక బస్సు
వనపర్తి టౌన్: మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల 12న తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వనపర్తి నుంచి సూపర్‌లగ్జరీ బస్సును నడపనున్నట్టు డిపో మేనేజర్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడురోజుల యాత్రకు పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 చొప్పున టికెట్ ధర నిర్ణయించామని.. దర్శనం టికెట్లు, టిఫిన్లు, భోజనం ఇతర ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 10వ తేదీ రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుందని.. తిరిగి 13వ తేదీ ఉదయం 3 వరకు వనపర్తికి చేరుకుంటుందని వెల్లడించారు. ఆసక్తిగల భక్తులు సెల్‌నంబర్లు 99592 26289, 96765 63377, 79957 01851 సంప్రదించాలని సూచించారు.
లక్ష్మీవేంకటేశ్వరుడి
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఏటా మాఘశుద్ధ తదియ నుంచి నవమి వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ ప్రధాన అర్చకుడు మరిగంటి జగన్మోహనాచార్యులు, ఆలయ కమిటీ సభ్యుడు విజయ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతా ఆహ్వానం, 3న హోమం, బలిహరణం, కల్యాణం, రాత్రి ప్రభోత్సవం, డోలోత్సవం, 4న ఉదయం నిత్య పూజలు, హోమం, బలిహరణం, రథోత్సవం, 5న ఉదయం హోమం, సాయంత్రం గ్రామోత్సవం, బలిహరణం, రాత్రి దోపోత్సవం, 6న ఉదయం హోమం, పూర్ణాహుతి, తీర్థావరి, చక్రస్నానం, ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, నాగవెల్లి, దేవత ఉద్వాసనంతో బ్రహోత్సవాలు ముగుస్తాయని వివరించారు. 7 నుంచి 16 వరకు జాతర కొనసాగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment