మహిళా ఉద్యోగులను వేధిస్తే చర్యలు
వనపర్తి: పనిచేసే చోట మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తే చర్యలు ఉంటాయని లోకల్ కంప్లయింట్ కమిటీ చైర్మన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోదిని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన లోకల్ కంప్లయింట్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు పని చేసుకునేలా మహిళా రక్షణ చట్టాలు ఉన్నాయని.. కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసేందుకు ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు, జిల్లాస్థాయిలో లోకల్ కంప్లయింట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యాలయాలు, ఇతర ప్రదేశాల్లో శారీరక, మానసిక వేధింపులకు గురిచేస్తే బాధితులు ఇంటర్నల్ కమిటీకి లేదా లోకల్ కమిటీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ఇంటర్నల్, లోకల్ కమిటీల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని.. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, కమిటీ సభ్యులు డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పరిమళ, రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, సీడీపీఓలు లక్ష్మమ్మ, హజీరా, బాలేశ్వరి, సూపరింటెండెంట్ అరుంధతి, జిల్లా మహిళా సాధికారిక కేంద్రం కో–ఆర్డినేటర్ భాస్కర్, జనరల్ స్పెషలిస్ట్‌లు శ్రీవాణి, సలోమి, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ సుమ, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోదిని
Comments
Please login to add a commentAdd a comment