గ్రామసభలకు పోటెత్తిన అర్జీదారులు
వనపర్తి: ప్రజాపాలన గ్రామసభలకు మూడోరోజు గురువారం అర్జీదారులు పోటెత్తారు. జిల్లావ్యాప్తంగా 76 గ్రామ, వార్డు సభలు కొనసాగగా.. గడిచిన రెండ్రోజుల మాదిరిగానే అత్యధికంగా కొత్త రేషన్‌కార్డులకు 5,529 దరఖాస్తులు వచ్చాయి. పాన్‌గల్, ఖిల్లాఘనపురంలో జరిగిన గ్రామసభల్లో మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. మొదటి, రెండోరోజు కొద్దిపాటి నిరసనలు, వ్యతిరేకతలు వచ్చినా.. మూడోరోజు ప్రశాంతంగా కొనసాగాయి.
పథకం లబ్ధిదారులు అభ్యంతరాలు ఆమోదం కొత్త
దరఖాస్తులు
ఇందిరమ్మ ఇళ్లు 12,147 62 11,902 3,565
రైతు భరోసా 8,471 413 8,068 174
రేషన్ కార్డులు 6,333 133 6,044 5,529
ఇందిరమ్మ
ఆత్మీయ భరోసా 2,004 515 1,448 1,453
Comments
Please login to add a commentAdd a comment