మదినిండా మువ్వన్నెల జెండా
మక్తల్: పట్టణంలోని వినాయక నగర్‌కు చెందిన ఆర్య నర్సప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. జాతీయ పండగ వచ్చిందంటే చాలు అతడి ఇల్లు మువ్వన్నెల జెండాలతో వేడుకలకు ముస్తాబవుతోంది. కుటుంబ సభ్యులంతా పొద్దున్నే లేచి.. వాకిట్లో కల్లాపి చల్లి జాతీయ పతాకం ఎగురవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు. పిల్లలు జాతీయ గీతాలపన చేస్తుంటే.. పెద్దలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అందరికీ స్వీట్లు పంచిపెడతారు. స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలను 76 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. 2000 ఏప్రిల్ 28న ఆర్య నర్సప్ప మృతిచెందారు. అయితే అతడు చరమాంక దశలో ఉన్నప్పుడు జెండా పండగను ఎట్టి పరిస్థితుల్లో మరవరాదని.. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున తప్పనిసరిగా జాతీయ పతాకం ఎగురవేయాలని కుటుంబ సభ్యులతో మాట తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులందరూ ఆర్య నర్సప్ప అడుగుజాడల్లో నడుస్తున్నారు.
76 ఏళ్లుగా క్రమం తప్పకుండా జాతీయ పతాకావిష్కరణ
దేశభక్తి చాటుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు ఆర్య నర్సప్ప కుటుంబం
Comments
Please login to add a commentAdd a comment