నేడు కోస్గిలో ముఖ్యమంత్రి పర్యటన
కోస్గి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డుల పథకాలను కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామం వేదికగా ప్రారంభించనున్నారు. సీఎం సొంత నియోజకవర్గం నుంచి నాలుగు కొత్త పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఎస్పీ లింగయ్యతోపాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రవంచ గ్రామ శివారులో ఉన్న డాగ్‌బంగ్లా సమీపంలో హెలిప్యాడ్‌తోపాటు బహిరంగ సభ కోసం స్థలాన్ని ఎంపిక చేశారు. సీఎం పర్యటన శనివారం ఆకస్మాత్తుగా ఖరారు కావడంతో అధికారులు హుటాహుటీన గ్రామానికి చేరుకొని హెలిప్యాడ్ ఏర్పాటు చేయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బలగాలతో బందోబస్తు నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రాంచందర్ నాయక్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
భారీ పోలీస్ భద్రత..
మహబూబ్‌నగర్ క్రైం: చంద్రవంచ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి 261 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తుకు కేటాయించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 26 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, 30 మంది హెడ్ కానిస్టేబుల్స్, 120 మంది కానిస్టేబుల్స్, 28 మంది మహిళ హోంగార్డులు, 35 మంది హోంగార్డులకు బందోబస్తు విధులు కేటాయించారు. వీరితో పాటు అదనంగా నాలుగు ఏఎస్‌సీ బృందాలు, రోప్ బృందాలు మూడు, యాక్సెస్ కంట్రోల్ బృందాలు 11, రోప్ పార్టీ బృందాలు రెండు కేటాయించారు. వీరితో పాటు నారాయణపేట జిల్లా స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు వికారాబాద్, రంగారెడ్డి నుంచి కొంత పోలీస్ బలగాలను సీఎం కార్యక్రమం దగ్గర విధులు కేటాయించనున్నారు.
చంద్రవంచ గ్రామం నుంచి
కొత్త పథకాలు ప్రారంభించనున్న సీఎం
బహిరంగ సభ ఏర్పాట్లను
పరిశీలించిన పేట కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment