గణతంత్రానికి ముస్తాబు
వనపర్తి: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో 76వ గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దేశభక్తి ఉట్టిపడేలా మువ్వన్నెల జెండా ఆవిష్కరణ, స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమాలతో పాటు పోలీస్ కవాతు నిర్వహించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన 148 మందికి ప్రశంసా పత్రాలు అందించేందుకు జాబితా సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించేందుకు ప్రత్యేక స్టాల్స్, విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూర్చొని వేడుకలు తిలకించేందుకు ఏర్పాటు చేశారు.
కార్యక్రమాల నిర్వహణ ఇలా..
ఉదయం 8:55 గంటలకు ఎస్పీ రావుల గిరిధర్, 8.58 గంటలకు కలెక్టర్ ఆదర్శ సురభి వేదిక వద్దకు చేరుకుంటారు. 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 9:15 గంటలకు జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారు. తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించి విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే సాంస్కతిక కార్యక్రమాలను తిలకించి, స్టాళ్లను సందర్శిస్తారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చెక్కులు అందిజేస్తారు. ఈ ఏడాది శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వేడుకల నిర్వహణ
విద్యుద్ధీపాల అలంకరణలో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం
Comments
Please login to add a commentAdd a comment