రహదారి నిబంధనలపై అవగాహన ఉండాలి
వనపర్తి: ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా వాటిని విధిగా పాటించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. మండలస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, బూట్లు ధరించాలని సూచించారు. వీపనగండ్ల విద్యార్థుల బృందం ప్రథమ స్థానం, మదనాపురం, కొత్తకోట మండలాల విద్యార్థుల బృందాలు ద్వితీయ స్థానాల్లో నిలవగా వారిని అభినందించారు. విజేత జట్లకు త్వరలోనే బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment