తనిఖీల్లో భాగంగా న్యాక్ బృందం పీయూ స్పోర్ట్స్ కాంప్లెక్సును సందర్శించారు. ఈ సందర్భంగా క్యారమ్స్ బోర్డు గదిలో అధికారులు సరదాగా క్యారమ్స్ ఆడారు. న్యాక్ కమిటీ చైర్మన్ రామశంకర్ దుబే, సభ్యులు కేకే అగర్వాల్ ఒక జట్టు, పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప మరో జట్టుగా క్యారమ్స్ ఆడారు. అక్కడ ప్రతి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ వివరాలు, విద్యార్థులకు యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఆడేందుకు అందిస్తున్న అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల నిర్మించిన సింథటిక్ ట్రాక్, ఏర్పాటు చేయబోయే ఫుట్‌బాల్ గ్రౌండ్, అథ్లెటిక్స్ వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల నిర్మించిన బాస్కెట్‌బాల్ కోర్టును సందర్శించారు. శనివారం సాయంత్రంతో న్యాక్ పీర్ కమిటీ మూడు రోజుల సందర్శన ముగియనుంది. సాయంత్రం పీర్ కమిటీకి వీడ్కోలు కార్యక్రమాన్ని పీయూ అధికారులు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment