ఆర్టిజన్ కార్మికుల దీక్ష విరమణ
వనపర్తి రూరల్: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాకేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ టీవీఏసీ జేఏసీ నాయకులు ఐదురోజులుగా చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం ముగిశాయి. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను విద్యార్హతల ఆధారంగా కన్వర్షన్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆనంద్‌గౌడ్, ఎండీ ఫారూఖ్, రామకృష్ణ, బాలరాజు, ఎండీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment