ముగిసిన గ్రామ, వార్డు సభలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన గ్రామ, వార్డు సభలు

Published Sat, Jan 25 2025 12:43 AM | Last Updated on Sat, Jan 25 2025 12:42 AM

ముగిస

ముగిసిన గ్రామ, వార్డు సభలు

వనపర్తి: గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న నాలుగు సంక్షేమ పథకాల అమలుకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామ, వార్డు సభలు శుక్రవారం ముగిశాయి. నాలుగు రోజుల్లో జిల్లావ్యాప్తంగా 255 గ్రామపంచాయతీలు, ఐదు పురపాలికల్లోని 348 వార్డుల్లో సభలు జరిగాయి. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతుభరోసా నాలుగు పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం సభలు నిర్వహించిన విషయం విధితమే. లబ్ధిదారుల జాబితాపై శనివారం జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోద ముద్ర వేయనున్నారు.

చివరిరోజు ఇలా..

నాలుగో రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా 16 గ్రామ, వార్డు సభలు జరగగా.. ఇందిరమ్మ ఇళ్లకు 3,015 మందిని అర్హులుగా గుర్తించారు. అదనంగా మరో 883 దరఖాస్తులు వచ్చాయి. ఆత్మీయ భరోసా పథకానికి 361 కుటుంబాలను అర్హులుగా గుర్తించగా 52 అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొత్తగా మరో 20 అర్జీలు దాఖలయ్యాయి. కొత్త రేషన్‌ కార్డుల జారీకి 1,245 కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. పదింటిపై అభ్యంతరాలు వ్యక్తమవగా.. 1,235 ఎంపికయ్యాయి. మరో 1,478 అర్జీలు దాఖలయ్యాయి. రైతుభరోసా పథకానికి 300 మందిని అర్హులుగా జాబితాను సిద్ధం చేసి గ్రామ, వార్డుసభల్లో అధికారులు చదివి వినిపించగా.. 10 అభ్యంతరాలు వచ్చాయి. మరో 8 అర్జీలు దాఖలయ్యాయి.

పథకం లబ్ధిదారులు అభ్యంతరాలు ఆమోదం కొత్త

దరఖాస్తులు

ఇందిరమ్మ ఇళ్లు 59,839 288 57,557 10,708

రైతు భరోసా 44,277 1,280 44,655 343

రేషన్‌ కార్డులు 29,633 609 22,877 17,650

ఇందిరమ్మ

ఆత్మీయ భరోసా 10,048 1825 7,986 3,225

ప్రతి ఎకరాకు సాగు నీరు..

వనపర్తి రూరల్‌: ఖాన్‌ చెరువు కాల్వను త్వరలోనే పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్దగూడెంతండాలో జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు రవికిరణ్‌, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, నాయకులు వాల్యానాయక్‌, ధర్మానాయక్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ముగిసిన గ్రామ, వార్డు సభలు 1
1/1

ముగిసిన గ్రామ, వార్డు సభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement