రాష్ట్రపతి అవార్డుకు ఆరేపల్లి వాసి ఎంపిక
ఆత్మకూర్: మండలంలోని ఆరేపల్లికి చెందిన మత్స్యకారుడు ఏటికాడి ఆనంద్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారని మత్స్యశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ప్రకటించారు. ఆనంద్ ఆరేపల్లిలో పదేళ్లుగా నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేస్తూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు రాయితీపై ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో రాష్ట్రపతి ముర్మూ చేతుల మీదుగా ఉత్తమ మత్స్యకారుడిగా, చేపపిల్లల ఉత్పత్తిదారుగా, పంపిణీదారుడిగా అవార్డు అందుకోనున్నారు.
రామన్‌పాడులో
పూర్తిస్థాయి నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 640 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. ఎన్టీఆర్ కాల్వకు 415 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 35, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
వేరుశనగకు
గిట్టుబాటు ధర కల్పించాలి
వనపర్తి రూరల్: రైతులు పండించిన వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా రైతు సంఘం కార్యదర్శి పరమేశ్వరాచారి కోరారు. శుక్రవారం మండలంలోని చిట్యాల శివారు వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులతో కలిసి వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులతో అప్పులు తెచ్చారని.. తీరా పంట చేతికొచ్చి విక్రయించే సమయంలో గిట్టుబాటు ధరలు లభించక నష్టపోతున్నారని వివరించారు. ప్రభుత్వం క్వింటాకు రూ.10 వేల మద్దతు ధర కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతులు నారాయణ, శ్రీనివాసులు, వెంకటయ్య, కురుమూర్తి, మన్యం, రాములు పాల్గొన్నారు.
పాలెం వెంకన్న
హుండీ లెక్కింపు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో హుండీని శుక్రవారం లెక్కించారు. నాలుగు నెలలకు గాను హుండీ ఆదాయం రూ.2,95,970 వచ్చినట్లు ఆలయ కమిటీ తెలిపింది. జిల్లా దేవాదాయ పర్యవేక్షకులు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో హుండీని లెక్కింపు చేపట్టగా.. కురవి రామానుజాచార్యులు, జయంత్‌శుక్ల, అరవింద్, చక్రపాణి, మాజీ ధర్మకర్తలు సురేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment