రెండోరోజూ న్యాక్ బృందం పర్యటన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ గద్వాల టౌన్/ కొల్లాపూర్: పాలమూరు యూనివర్సిటీలో న్యాక్ పీర్ టీం రెండోరోజూ పర్యటన కొనసాగింది. ఈ మేరకు ప్రధానంగా ఫార్మసీ ఆడిటోరియంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బంది సమస్యలను కమిటీ చైర్మన్ రామశంకర్ దుబే అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రతిపాదికన పనిచేస్తున్నారు.. వేతనాలు ఎలా ఉన్నాయి.. ఈఎస్‌ఎఐ, పీఎఫ్ వంటివి ఉన్నాయా అని ఆరాతీశారు. అలాగే పీయూ అల్యూమిన్ (పూర్వ విద్యార్థులతో) కూడా న్యాక్ కమిటీ సమావేశమైంది. విద్యార్థులకు అందిస్తున్న కోర్సులు, చదువులు పూర్తయ్యాక క్యాంపస్ సెలక్షన్స్, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించినట్లు సమాచారం. పలు పరిశోధన పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా కొల్లాపూర్, గద్వాల పీజీ సెంటర్లను జయశ్రీ నాయర్, అన్న స్వామినారాయణమూర్తి సందర్శించి పలు అంశాలపై ఆరాతీశారు.
Comments
Please login to add a commentAdd a comment