నా చిన్నతనంలో జెండా పండుగ లేదు..
నా భర్త అంబటి చంద్రశేఖర్ దేశ స్వాతంత్య్రం కోసం కొట్లాడారు. నా చిన్నతనంలో జెండా పండుగలు, జెండా ఎగురవేయడం చేయలేదు. అప్పటి నిజాం సర్కారు పాలనలో హక్కులు, సమానత్వం లేదు. అన్నింటికీ ఆంక్షలే ఉండేవి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం వచ్చాక అన్నింటా ఆడ, మగ సమానత్వం లభించింది. అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, ఓటుహక్కు వచ్చాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మహిళలు రాజకీయంగా రాణించేందుకు అవకాశం దక్కింది. అందరికీ విద్య అందుబాటులోకి వచ్చింది. అక్షరాస్యత శాతం పెరిగింది. – అంబటి లీలావతి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment