20 ఎకరాల్లో జిల్లా కోర్టు నిర్మాణం
వనపర్తి టౌన్: జిల్లా కోర్టు సముదాయాన్ని 20 ఎకరాల్లో నిర్మించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్‌పోలియో న్యాయమూర్తి జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు జిల్లా న్యాయమూర్తులతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కోర్టులో పెండింగ్, డిస్పోజబుల్ కేసులు, న్యాయవాదులు, కక్షిదారుల సమస్యలపై న్యాయమూర్తులతో సమీక్షించారు. పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రజని, న్యాయమూర్తులు కవిత, రవికుమార్, శ్రీలత, జానకి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్‌కుమార్, ప్రధానకార్యదర్శి బాలనాగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment