సేంద్రియ సాగులో కర్షక దంపతులు..
లాభాలు, నష్టాల తలంపు లేకుండా ప్రకృతినే నమ్ముకుంటూ రసాయనిక ఎరువులు వాడకుండా 24 ఏళ్లుగా సేంద్రియ సాగులో నిమగ్నమవుతున్నారు ఓ రైతు దంపతులు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన కొసిరెడ్డి లావణ్య, రమణారెడ్డి దంపతులు 24 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక మందులు వాడకుండా, నేలకు, నీటికి, ప్రకృతికి నష్టం చేయకుండా సేంద్రియ ఎరువులతోనే పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సన్నరకం, బాస్మతి తదితర వరి వంగడాలతోపాటు మిర్చి, పసుపు, జొన్నలు వంటి పంటలు సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. ప్రధానంగా మిర్చి పంటకు చీడపీడల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రైతులు మిర్చి పంటకు వారం, పదిరోజులకు ఒకసారి రసాయనిక ఎరువులతో పంటలను కాపాడుకుంటారు. కానీ, వీరు మాత్రం రసాయనిక ఎరువులు వాడకుండా, కేవలం సేంద్రియ ఎరువులతో మిర్చి పంట పండిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన విషముష్టికాయలతో కషాయం, ఆవు మూత్రం, పేడలతో ఎరువులు తయారు చేసి పంటలను కాపాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment