క్షయ నియంత్రణలో భాగస్వాములవ్వాలి
అమరచింత: క్షయ నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో తిపుడంపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో క్షయ శిబిరం నిర్వహించగా ఉగాండా, జెనీవాకు చెందిన గ్లోబల్‌ఫండ్ ఆర్గనైజేషన్ బృందం సందర్శించింది. వారికి డీఎంహెచ్‌ఓ అందుతున్న అందుతున్న వైద్య సేవల గురించి వివరించారు. నిరంతరం గ్రామాల్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, వ్యాధిగ్రస్తుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నివారణ మాత్రలు, ఆరునెలల పాటు న్యూట్రీషన్ ఫుడ్ అందిస్తున్నామని వివరించారు. శిబిరంలో అత్యాధునిక పరికరాలతో వంద మందిని పరీక్షించగా 9 మందికి క్షయ సోకినట్లు నిర్ధారణ కాగా.. మందులు పంపిణీ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధిగా మాస్క్ ధరించాలని, కుటుంబ సభ్యులతో కలిసి మెలసి ఉంటున్నా.. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డా. సాయినాథ్‌రెడ్డి, డా. పరిమళ, డా. రుపాశ్రీ, తిపుడంపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డా. నందకిశోర్, డా. నిఖిత, సూపర్‌వైజర్ సురేందర్‌గౌడ్, సీహెచ్‌ఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment