ఐదేళ్లు.. ఐదు గ్యారంటీ పథకాలు | - | Sakshi
Sakshi News home page

ఐదేళ్లు.. ఐదు గ్యారంటీ పథకాలు

Published Sun, Oct 20 2024 1:28 AM | Last Updated on Sun, Oct 20 2024 1:28 AM

ఐదేళ్లు.. ఐదు గ్యారంటీ పథకాలు

కమలాపూర్‌: సర్పంచ్‌గా తనకు అవకాశమిచ్చి గెలిపిస్తే ఐదేళ్లలో ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేస్తానని హామీ ఇస్తూ కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామ సర్పంచ్‌ పదవిని ఆశిస్తున్న ఓ ఆశావహుడు తన మేనిఫెస్టో విడుదల చేసి వినూత్న ప్రచారానికి తెరలేపాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఉప్పులపల్లికి చెందిన ర్యాకం శ్రీనివాస్‌ అనే ఓ ఆశావహుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను సర్పంచ్‌గా పోటీ చేస్తానని, తనను గెలిపిస్తే ఐదేళ్ల పదవీ కాలంలో ఐదు గ్యారంటీ పథకాలు అమలు చేస్తానని ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఉప్పులపల్లి గ్రామస్తులకు ఐదేళ్లు ఇంటి, నల్లా పన్ను ప్రీ అని, గ్రామస్తులకు ఆడబిడ్డ పుడితే రూ.5,116 డిపాజిట్‌ చేస్తానని, గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తానని, మూతబడిన బడిని తెరిపిస్తానని, నెలకు ఒకసారి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందిస్తానని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వంనుంచి వచ్చే పింఛన్లు, పక్కా ఇళ్లు, రుణాలు, ఇతరత్రా పథకాలను రాజకీయాలకు అతీతంగా అందిస్తానని పేర్కొన్నాడు. ఈ ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో మండలంలోచర్చనీయాంశమైంది.

మేనిఫెస్టో విడుదల చేసిన

ఓ సర్పంచ్‌ ఆశావహుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement