అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
నర్సంపేట: నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈమేరకు పట్టణంలోని పలు డివిజన్లలో శంకుస్థాపనలు, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌తో ఆరో డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్ధిక సంఘం నుంచి రూ.4.5 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.25 కోట్లు వెచ్చించి పట్టణమంతా సుందరీకరణ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఓర్సు తిరుపతి, తొగరు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, కౌన్సిలర్లు వేముల సాంబయ్య, ఓర్సు అంజలి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment