రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు ఉప్పరపల్లి విద్యార్
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు మండలంలోని ఉప్పరపల్లి పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు వేణు తెలిపారు. ఇటీవల హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అండర్–14 స్కూల్ గేమ్స్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థులు అవినయ్ సాయిరామ్, రాంచెర చరణ్, వినయ్‌కుమార్, అండర్–17 విభాగంలో పదో తరగతి విద్యార్థి సాయికిరణ్ ప్రతిభ కనబరిచారు. డిసెంబర్‌లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వీరు ఆడనునున్నారు. ఈ మేరకు విద్యార్థులు, పీఈటీ వీరస్వామిని బుధవారం పాఠశాలలో హెచ్‌ఎం వేణు, ఉపాధ్యాయులు టి.ఉషారాణి, శ్రీదేవి, ఎ.రాజు, లింగమూర్తి, విజయ్, రూపమణి, సదానందం ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్ రజిత అభినందించారు.
రేపు దివ్యాంగులకు
క్రీడాపోటీలు
కాళోజీ సెంటర్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఓసిటీలోని ఇండోర్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడాపోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి బి.రాజమణి బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ విభాగంలో 10 నుంచి 17 సంవత్సరాలు, సీనియర్స్ విభాగంలో 18 నుంచి 54 సంవత్సరాలు ఉన్న మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంధులకు రన్నింగ్, షాట్‌పుట్, చెస్ పోటీలు, బధిరులకు రన్నింగ్, షాట్‌పుట్, క్యారం, శారీరక వైకల్యం కలిగిని వారికి షాట్‌పుట్, వీల్‌చైర్, ట్రైసైకిల్ రేస్, క్యారం, బుద్ధిమాంధ్యం కలిగిన వారికి రన్నింగ్, షాట్‌పుట్, క్యారం పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. క్రీడాపోటీలకు హాజరయ్యే దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఆధార్‌కార్డు వెంట తీసుకొని రావాలని, వివరాలకు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని రాజమణి కోరారు.
జాతీయస్థాయి హాకీ
పోటీలకు విద్యార్థిని సిరి
నర్సంపేట రూరల్: జాతీయస్థాయి హాకీ పోటీలకు గురిజాల గ్రామానికి చెందిన మొగులోజు రాజు–రజిత దంపతుల కుమార్తె సిరి ఎంపికై ందని గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు గొలనకొండ వేణు, ప్రదాన కార్యదర్శి చుక్క రాజేందర్ తెలిపారు. ఈనెల 11 నుంచి 13 వరకు నిజామాబాద్‌లో జరిగిన పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు తరఫున ఆడి ప్రతిభ కనబరిచిందని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 27న వరకు హర్యాణా రాష్ట్రంలోని రోతక్ జిల్లాలో జరిగే అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ఆమె ఆడనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సిరి ఆదిలాబాద్‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోందని వివరించారు. కోచ్ పెద్దివారు శ్రీనివాస్ వద్ద సిరి హాకీలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా బుధవారం ఆమెను గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక బాధ్యులు, మాజీ సర్పంచ్ గొడిశాల మమతాసదానందం సన్మానించారు.
23న మహిళల
కబడ్డీ జట్టు ఎంపిక
కాశిబుగ్గ: ఓసిటీ స్టేడియంలో ఈనెల 23న మహిళల జిల్లా సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపిక నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి అబ్దుల్లాఖాన్, సహాయ కార్యదర్శి కె.మల్లికార్జున్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 75 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ఆడుతారని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఓసిటీ స్టేడియానికి రావాలని వారు సూచించారు.
నేడు బీసీ డెడికేషన్ కమిషన్ రాక
కాజీపేట అర్బన్: హనుమకొండ కలెక్టర్ కార్యాలయానికి బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, సెక్రటరీ సైదులు గురువారం రానున్నట్లు బీసీ వెల్ఫేర్ డీడీ రాంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వెనుకబడిన తరగతుల కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment