జోరుగా గంజాయి దందా ● యువతే టార్గెట్‌గా బిజినెస్ ● విచ్
నవంబర్ 8న వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో 48 కిలోల గంజాయిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫాం–2, 3 వైపు ప్లాస్టిక్ సంచులు, బుట్టలతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని తనిఖీ చేయగా.. గుట్టురట్టయ్యింది. ఒడిశాలోని గంజాం జిల్లా తలపాడు గ్రామానికి చెందిన బాబిత కుమారి పాణిగ్రహి గుజరాత్‌లోని సూరత్‌కు తరలిస్తుండగా.. గంజాయి లభ్యమైంది.
‘పుష్ప’ సినిమా తరహాలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొందరు ఒడిశాలోని నాటుగురులో 338 కిలోల గంజాయి కొని 96 ప్యాకెట్లుగా మార్చి ట్రాక్టర్ ట్రాలీ కింద భద్రపర్చి వరంగల్ నుంచి కామారెడ్డికి సెప్టెంబర్ 21న తరలిస్తుండగా.. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ వద్ద యాంటీ డ్రగ్స్ పోలీసులు పట్టుకున్నారు.
సెప్టెంబర్ 28న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రెవెన్యూ ఉద్యోగి మరిపెడ నుంచి హైదరాబాద్‌కు కారులో గంజాయి తరలిస్తూ గాలివారిగూడెం సమీపంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అందులో రూ.31.75 లక్షల విలువైన 127 కిలోల ఎండు గంజాయి లభించింది.
ఆగస్టు 28న సుబేదారి పోలీసులు హనుమకొండ అంబేడ్కర్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మంగపేట మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.23 వేల విలువైన 880 గ్రాముల
గంజాయితో పట్టుబడ్డారు.
వరంగల్ జిల్లా ఖానాపురం, చెన్నారావుపేటకు చెందిన ముగ్గురు యువకులు హనుమకొండలోని పెగడపల్లి డబ్బాల సమీపంలో గంజాయి సేవిస్తూ ఇటీవల కేయూసీ పోలీసులకు పట్టుబడ్డారు.
మొత్తం
కేసులు
389
డిస్‌పోస్డ్ డ్రగ్
(కిలోల్లో)
35,319.587
మొత్తం కేసులు, పట్టుబడిన గంజాయి,
దాని విలువ
విలువ
(రూ.కోట్లలో)
88.08
Comments
Please login to add a commentAdd a comment