నకిలీ క్లినిక్‌లలో తనిఖీలు
ఎంజీఎం: నగరంలోని నకిలీ పైల్స్ డాక్టర్స్ క్లినిక్‌లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీజీఎంసీ అధికారి డాక్టర్ నరేశ్‌కుమార్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్ మియా ఆధ్వర్యంలో పైల్స్ చికిత్స అందించే నకిలీ వైద్యులపై స్టింగ్ ఆపరేషన్ నోటీసులు జారీ చేశారు. హనుమకొండహనుమాన్ గుడి సమీపంలోని మారుతి క్లినిక్ /ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పేరుతో నిర్వహిస్తున్న ఆర్‌కే బిశ్వాస్, అదే ప్రాంతంలోని అనుపమ క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహిస్తున్న నకిలీ ఆయుర్వేదిక్ వైద్యుడు ఏకే సర్కార్, కుమార్‌పల్లిలోని శ్రీలక్ష్మీ క్లినిక్ నిర్వాహకుడు నకిలీ ఆయుర్వేద వైద్యుడు బిశ్వాస్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. వారికి నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేసినట్లు వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ అసోసియేట్ సభ్యుడు డాక్టర్ శిరీశ్ తెలిపారు. ప్రజలు నకిలీ వైద్యులను నమ్మి మోసపోవొద్దని, క్లినిక్‌లకు వచ్చే పేషెంట్లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే పైల్స్, పిస్టులా ఉన్నట్లు నమ్మిస్తూ వారి నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు లేని చికిత్సల వల్ల ప్రజలకు మరింత అనారోగ్య సమస్యలు పెరుగుతాయని చివరికి వారి ప్రాణాల మీదికే రావొచ్చని సూచించారు.
నిట్‌తో హెచ్‌సీ
రోబోటిక్స్ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌తో హైదరాబాద్ హెచ్‌సీ రోబోటిక్స్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, హెచ్‌సీ రోబోటిక్స్ ప్రతినిధులు డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ దిలీప్ ఎంఓయూ పత్రాలను గురువారం అందజేసుకున్నారు. నిట్ వరంగల్‌లో స్వదేశీ ఇంటెలిజెంట్ డ్రోన్ , నిఘా వ్యవస్థ రూపకల్పనకు విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఈ ఎంఓయూ తోడ్పడుతుందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు సతీశ్‌కుమార్, వేణువినోద్, శ్రీనివాసాచార్య, ఆంజనేయులు, శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment