పోగొట్టుకున్న బంగారు ఆభరణాల అందజేత
కమలాపూర్: పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించిన ఘటన కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరానికి చెందిన చెరిపెల్లి ఉష సుమారు రెండు నెలల క్రితం పాత చీరలకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామని తిరుగుతున్న ఓ చిరువ్యాపారికి తన చీరలను అమ్మింది. పాత చీరలతో పాటు ఆ చీరల్లో దాచుకున్న రూ.లక్ష విలువైన తులం పావు బంగారు ఆభరణాలు (జత కమ్మలు, రెండు వంక ఉంగరాలు) సైతం పోవడంతో బాధితురాలు కమలాపూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పాత చీరలకు ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చే వ్యాపారులను పిలిపించారు. వారు కొన్న పాత చీరల్లో ఉష పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు దొరికాయి. ఆబంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉషకు గురువారం అందజేశారు. ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావుకు ఉష కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment