నేటి నుంచి క్రికెట్ టోర్నమెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్ కాలేజీయెట్ క్రికెట్ టోర్నమెంట్‌ను (పురుషుల) ఈనెల 22, 23, 24 తేదీల్లో మూడ్రోజులపాటు నిర్వహించనున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ వై.వెంకయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈటోర్నమెంట్ ప్రారంభ సమావేశానికి కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు.
డీఆర్డీఓగా
మేన శ్రీను
హన్మకొండ అర్బన్: హనుమకొండ డీఆర్డీఓగా మేన శ్రీనును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్డీఓగా పని చేసిన నాగపద్మజ పంచాయతీరాజ్ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకాలం హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా పని చేసిన మేన శ్రీను ఇటీవల మాతృ శాఖకు వెళ్లారు. తాజాగా హనుమకొండ జిల్లాకు డీఆర్డీఓగా వచ్చారు.
భద్రకాళి అమ్మవారికి
ఉన్నతాధికారుల పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయాన్ని గురువారం బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బి.వెంకటేశ్వర్‌రావు రిటైర్డ్ ఐఏఎస్, బీసీ కమిషన్ సెక్రటరీ సైదులు ఐఎఫ్‌ఎస్, డిప్యూటీ డైరెక్టర్ రమేశ్, జిల్లా అధికారులు సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ పర్యవేక్షకులు అద్దంకి విజయ్‌కుమార్, అర్చకులు ఆలయానికి వచ్చిన ఉన్నతాధికారులను ఘనంగా స్వాగతించారు. వారు ముందుగా ఆది శంకరులను, వల్లభ గణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ స్నపన మండపంలో వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు.
కేయూ డాక్టరేట్స్
అసోసియేషన్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కేయూలో తొలిసారిగా అసోసియేషన్ ఆఫ్ కేయూ డాక్టరేట్స్ (ఏకేయూడీ) ఏర్పాటైంది. ఈమేరకు గురువారం ఏకేయూడీ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా యూనివర్సిటీలో పరిశోధన, అకడమిక్ అంశాలను పెంపొందించేలా ఈఅసోసియేషన్ కృషి చేయనుంది. కాగా ఈ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొల్లు నర్సింహారావు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కేయూ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, రంగారెడ్డి, కార్యదర్శిగా చిలువేరు రాజ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. అలాగే ఉపాధ్యక్షులుగా సంగాల ఎఫ్రిమ్‌రాజు, బి.ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా బండి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టి.ఆశీర్వాదం, సెక్రటరీలుగా పి.మహేందర్, వి.సుధాకర్, స్పోక్స్ పర్సన్స్‌గా డాక్టర్ జె.సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈఅసోసియేషన్‌కు గౌరవ అధ్యక్షుడిగా పుల్లా శ్రీనివాస్ వ్యవహరించనున్నారు. కార్యవర్గసభ్యులుగా ఎం లింగయ్య, ఓ రవీందర్, చీఫ్ అడ్వయిజర్లుగా ప్రొఫెసర్ నారాయణ, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, బి.శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. ఈకార్యవర్గం మూడేళ్లపాటు కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment