ఫీడర్లకు లైన్‌ఫాల్ట్ ఇండికేటర్లు
దుగ్గొండి: వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఫీడర్లకు లైన్‌ఫాల్ట్ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తామని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం, రేకంపల్లి సబ్‌స్టేషన్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. సమస్యలు గుర్తించి పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మల్లంపల్లి గ్రామ విద్యుత్ ఫీడర్‌కు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన లైన్‌ఫాల్ట్ ఇండికేటర్‌ను పరిశీలించి మాట్లాడారు. విద్యుత్ పీడర్లకు లైన్‌ఫాల్ట్ ఇండికేటర్లు అమరిస్తే లైన్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుస్తాయని తెలి పారు. దీంతో నిమిషాల వ్యవధిలో విద్యుత్ పునరుద్ధరించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన లైన్‌ఫాల్ట్ ఇండికేటర్ల పనితీరు బాగుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిరంతరం నాణ్యమైన వి ద్యుత్ అందించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు. సీఎండీ వెంట సీఈలు అశోక్, కిషన్, రాజుచౌహాన్, జీఎం శ్రీనివాస్, ఎస్‌ఈ మధుసూదన్, డీఈ తిరుపతి, ఏడీ లక్ష్మణ్ ఏఈలు రామ్మూర్తి, ప్రత్యూష, లైన్ ఇన్‌స్పెక్టర్ అజీంపాషా, లైన్‌మెన్లు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment