వివరాల నమోదులో నిర్లక్ష్యం వద్దు
ఖానాపురం/నల్లబెల్లి/ దుగ్గొండి: ఇందిరమ్మ ఇళ్ల సర్వే సందర్భంగా వివరాలను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి అన్నారు. సోమవారం ఖానాపురం మండలం కొత్తూరు, నల్లబెల్లి మండలం కొండాయిపల్లి, రుద్రగూడెం, దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవనాలు ఉన్న వారి వివరాలు నమోదు చేయొద్దని, గుడిసెలు, పెంకుటిళ్లు ఉండి అర్హత కలిగిన ప్రతీఒక్కరి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక సర్వే వేగవంతంగా చేపడుతూ ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక చేసేందుకు 619 మంది ఎన్యుమరేటర్లను నియమించగా సర్వేలో పాల్గొంటున్నారని, ఇప్పటివరకు 5,533 మంది ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు భారతి, లెక్కల అరుందతి, ఎంపీఓలు సునీల్‌కుమార్, శ్రీధర్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, రజిత, పద్మనాభస్వామి, కవిత, కారోబార్ కాసు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ రాంరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment