వరంగల్ లీగల్: ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ సూచించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో మంగళవారం మహిళలకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జి అపర్ణాదేవి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యమని అన్నారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులకు డాక్టర్ వాసంతిరెడ్డి వైద్య పరీక్షలు చేశారు. రెండు జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్వర్యంలో వాసంతిరెడ్డిని అభినందించారు. హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు మాతంగి రమేశ్‌బాబు, తీగల జీవన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శులు ఎల్.రమేశ్, ముదస్సర్ అహ్మద్, మహిళా కార్యదర్శులు జంగా స్వప్న, డాక్టర్ గోపికారాణి, శ్రుతి, రమాదేవి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment