క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
వరంగల్ స్పోర్ట్స్: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మేయర్ గుండు సుధారాణి అన్నారు. హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులపాటు జరగనున్న సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలను మేయర్ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా క్రీడాకారుడు కావడంతో క్రీడల అభివృద్ధికి రూ.375 కోట్లు కేటాయించారని వెల్లడించారు. హనుమకొండ ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆధ్వర్యంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఆర్థో డాక్టర్‌తోపాటు స్టాఫ్‌నర్సులు, వైద్యసిబ్బంది, అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. సీపీ అంబర్ కిషోర్ ఝా, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి
Comments
Please login to add a commentAdd a comment