గ్రూపులు కట్టి.. విద్యార్థుల్ని రెచ్చగొట్టి!
దామెర: ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల ఉన్నతికి ఆటంకంగా మారుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన వారే గ్రూపులుగా విడిపోయి వారి భవితవ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. వరుస ఘటనలతో దామెర క్రాస్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాల వివాదాలకు కేంద్రంగా మారుతోంది. హనుమకొండ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలను ఇటీవల దామెర క్రాస్ వద్దగల భవనంలోకి మార్చారు. కాగా.. పాఠశాలలో 220 మంది విద్యార్థులు ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం విద్యార్థులు నీటి కొరత, అంటువ్యాధులతో బాధపడుతున్న విషయం తెలుసుకుని కలెక్టర్, ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బోధన, బోధనేతర సిబ్బంది గ్రూపులుగా విడిపోయి విద్యార్థులను రెచ్చగొట్టి పాఠశాలలో ఆందోళన నిర్వహించారు. దీంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు ఉద్యోగులుందరికీ మెమోలు జారీ చేశారు. ఇంత జరిగినప్పటికీ సిబ్బంది, ఉపాధ్యాయుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆదివారం రాత్రి తొమ్మిదో తరగతి విద్యార్థి ఒకరు హాస్టల్ నుంచి తనను తరగతికి గదికి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తించినట్లు.. చేయి చేసుకున్నట్లు ఆరో తరగతి విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా.. రాత్రి సమయంలో హాస్టల్‌లో విద్యార్థుల బాగోగులు చూసేందుకు వార్డెన్‌కానీ, ఉపాధ్యాయులు కానీ ఉండాలి.. హాస్టల్‌లో ఎవరి పర్యవేక్షణ ఉండకపోవడంతో విద్యార్థులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై శ్రీసాక్షిశ్రీ వార్డెన్‌ను వివరణ కోరగా.. తనకేమీ తెలియదని, ఉదయం ఆరున్నరకు వచ్చానని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికై నా అధికారులు దృష్టిసారించి ఆశ్రమ పాఠశాల సక్రమంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆశ్రమ పాఠశాలలో
ఉపాధ్యాయుల రాజకీయం
విద్యార్థుల జీవితాలతో చదరంగం
Comments
Please login to add a commentAdd a comment