మూడు చోట్ల అనుకూలం.. రెండు చోట్ల ప్రతికూలం
నెక్కొండ: నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కోరింది. దీంతో మున్సిపాలిటీలో నెక్కొండతోపాటు విలీనం కానున్న నెక్కొండ తండా, పత్తిపాక, గుండ్రపల్లి, అమీన్‌పేట, టేకులకుంట (టీకే) తండా జీపీ కార్యాలయాల్లో సోమవారం ప్రత్యేక గ్రామసభలను నిర్వహించారు. నెక్కొండ, పత్తిపాక, నెక్కొండ తండా జీపీ గ్రామసభల్లో గ్రామస్తులు ఏకగ్రీవంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు మద్దతు నిచ్చారు. అయితే గుండ్రపల్లిలో జరగాల్సిన గ్రామ సభ నేడు (మంగళవారం) నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ప్రవీణకుమార్ తెలిపారు. అలాగే అమీన్‌పేట, టీకే తండా గ్రామాల ప్రజలు మున్సిపాలిటీలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. అయితే అమీన్‌పేట, టీకే తండా గ్రామాలు అదే మండలంలోని అమీనాబాద్ రెవెన్యూ గ్రామ పరిధిలోనే కొనసాగడం, పోలీస్‌స్టేషన్ కూడా మారక పోవడం ఇబ్బందిగా ఉందని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా గ్రామసభల్లో గ్రామ ప్రత్యేక అధికారులు ప్రవీణ్‌కుమార్, రాజ్‌కుమార్, యాదగిరి, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment