సమస్యలు పరిష్కరిస్తాం..
ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు రెండు గంటల పాటు ప్రతీ విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓపీ సంఖ్య పెరుగుతున్నందున ప్రస్తుతం ఉన్న రెండు కౌంటర్లకు అదనంగా మరో కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్, సెక్యూరిటీ విభాగం, పారామెడికల్ సిబ్బంది కొనసాగింపుపై ప్రత్యేకంగా సమీక్షా చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి ఆస్పత్రిలో డ్రైయినేజీ వ్యవస్థ మెరుగుపరుస్తామన్నారు. అనంతరం గర్భిణులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మల, ఆర్‌ఎంఓలు డాక్టర్ వేణుగోపాల్, సత్యజిత్, ఏఓ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
సీకేఎం ఆస్పత్రిని ఆకస్మికంగా
తనిఖీ చేసిన కలెక్టర్ సత్యశారద
Comments
Please login to add a commentAdd a comment