ఆశ్రమ పాఠశాలలో విచారణ
దామెర: మండల కేంద్రం సమీపంలో ని గిరిజన ఆశ్రమ పాఠశాలలో వరుస ఘటనలపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు జిల్లా సహాయ గిరిజన సంక్షేమ అధికారి రూపాదేవి మంగళవారం పాఠశాలలో ఉపాధ్యాయులు, వార్డెన్, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలసుకున్నారు. అనంతరం దాడి విషయమై ఆరో తరగతి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థిని వేర్వేరుగా విచారించారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఏనుమాముల సీఐ రాఘవేందర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థానాలు అధిరోహించాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై అశోక్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.
బస్టాండ్ పనులు షురూ
వరంగల్ చౌరస్తా: వరంగల్ కొత్త బస్టాండ్ ఆధునికీకరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. రూ.72 కోట్ల నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు ఏడాదిన్నర క్రితం శంకుస్థాపన చేశారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఆర్టీసీ బస్ స్టేషన్ స్థలాన్ని స్వాధీనం చేసుకొని పాత భవనాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. నూతనంగా నిర్మించనున్న బస్ స్టేషన్ స్థలం చుట్టూరా 2.22 ఎకరాల విస్తీర్ణంలో హద్దులు ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment